“భోళా శంకర్”..సేమ్ ట్యూన్ దింపేసేలా ఉన్నారే.!

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో ఐతే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకోగా దీని తర్వాత చేస్తున్న రీమేక్ సినిమా “భోళా శంకర్”. దర్శకుడు మెహర్ రమేష్ మళ్ళీ మెగాస్టార్ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి భోళా శంకర్ ఛాన్స్ అయితే ఇచ్చారు.

ఇక ఈ చిత్రాన్ని అయితే తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” రీమేక్ గా ప్లాన్ చేస్తుండగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పలు సెట్టింగ్స్ నడుమ అయితే తెరకెక్కించారు. కాగా ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా భోళా మ్యూజిక్ మేనియా ని అనౌన్స్ చేశారు.

ఇపుడు ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ తాలూకా ఫస్ట్ ప్రోమో ని అయితే రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ ప్రోమో అయితే ఒరిజినల్ లో అనిరుద్ ఇచ్చిన “ఆలుమా డోలుమా” సాంగ్ కి సేమ్ ట్యూన్ ని దింపేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పాలి. ప్రోమోనే కాబట్టి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలీదు కానీ ట్యూన్ బీట్ అయితే అర్ధం అవుతుంది. దీనితో అయితే ఈ సాంగ్ ఒరిజినల్ గానే ఉందని చెప్పాలి.

మరి ఫుల్ సాంగ్ వచ్చాక కూడా ఉంటే ఇదేం పెద్దగా క్లిక్ అవ్వదనే చెప్పాలి. మహతి సాగర్ మ్యూజిక్ పై మంచి అంచనాలు అయితే ఉన్నాయి. మరి తాను ఈ అంచనాలు నిలుపుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా  సురేష్ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 
Bhola Mania Song Promo |BholaaShankar |Mega Star Chiranjeevi,Tamannaah, Keerthy Suresh |Meher Ramesh