లేటెస్ట్ : మెగా స్వాగ్ తో “భోళా శంకర్” ఫస్ట్ సాంగ్.!

మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మెగా ప్రాజెక్ట్ “భోళా శంకర్” కోసం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తన లాస్ట్ బిగ్ హిట్ “వాల్తేరు వీరయ్య” సినిమా తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతూ ఉండగా లేటెస్ట్ గా అయితే ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

మరి ఈ చిత్రం కి మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందించగా తాను ఇచ్చిన మొదటి భోళా మేనియా సాంగ్ ని రిలీజ్ చేయగా ఈ సాంగ్ అయితే ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ మాస్ స్వాగ్ తో అదిరిపోయింది అని చెప్పాలి. అయితే మ్యూజిక్ పరంగా పక్కన పెడితే మెగాస్టార్ తన ఈ ఏజ్ లో సూపర్ డాన్స్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు.

అయితే ఈ సెలెబ్రేటింగ్ మాస్ సాంగ్ మాత్రం జస్ట్ యావరేజ్ గానే ఉందని చెప్పాలి. మెగాస్టార్ రేంజ్ ఇంట్రో సాంగ్ అయితే ఇది ఖచ్చితంగా కాదు. అంతే కాకుండా మణిశర్మ చిరు కి ఇచ్చిన ఎన్నో ఇంట్రో సాంగ్స్ ని అయితే తన కొడుకు డెఫినెట్ గా మ్యాచ్ చేయలేదనే చెప్పాలి.

కానీ మెల్లగా అయితే ఓమాదిరిగా హిట్ అవుతుందేమో కూడా చూడాలి. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 
Bholaa Mania Lyrical Video | BholaaShankar | Mega Star Chiranjeevi |Meher Ramesh| Mahati Swara Sagar