థియేటర్స్ తర్వాత ఈ ఓటిటిలో బాలయ్య “భగవంత్ కేసరి”

ఇప్పుడు దసరా ఫీవర్ టాలీవుడ్ లో మొదలైంది. ఒక్క టాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా పలు భారీ చిత్రాలు రాబోతుండగా తెలుగు నుంచి అయితే ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ చిత్రాల రిలీజ్ లో టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

కాగా బాలయ్య నటించిన ఈ చిత్రం తన కెరీర్ లో 108వ సినిమా కాగా దీనికి అయితే దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. మరి ఈ చిత్రం నుంచి వచ్చిన మాస్ అండ్ పవర్ ఫుల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగ దీనితో పాటలుగా మరో కీలక అప్డేట్ కూడా రివీల్ అయ్యింది.

మరి ట్రైలర్ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో పోస్టర్ చూస్తే ఈ సినిమా ఓటిటి హక్కులు ఎవరికి ఇచ్చారు అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో అయితే ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అయితే రిలీజ్ కానుంది.

దీనితో భగవంత్ కేసరి థియేటర్స్ లో రిలీజ్ తర్వాత ఈ ఓటిటి లో సందడి చేయనున్నాడు అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.