సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది న్యూ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. 2024లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకర్షించిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయి, ఔరంగాబాద్‌లో పుట్టి నైజీరియాలో పెరిగి, ముంబైలో తన విద్యను కొనసాగించింది. మోడలింగ్ రంగంలో తన టాలెంట్ చూపించి, డెయిరీ మిల్క్ యాడ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
భాగ్యశ్రీ మొదట బాలీవుడ్‌లో “యారియన్ 2” సినిమాతో వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ సినిమాలో నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఆఫర్స్ మాత్రం టాలీవుడ్ నుంచి వెల్లువలా వచ్చాయి. రవితేజ హీరోగా తెరకెక్కిన “మిస్టర్ బచ్చన్”తో టాలీవుడ్‌కు అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, మార్వాడీ పాత్రలో భాగ్యశ్రీ తన అభినయంతో ప్రత్యేక గుర్తింపును పొందింది.
ఇప్పుడు టాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగంగా చురుకుగా కొనసాగుతోంది. మహేష్ బాబు, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న “RAPO 22″లో భాగ్యశ్రీకి కీలక పాత్ర లభించింది. ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్న భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. అలాగే, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న VD 12లో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది.
ఇక బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి ఆఫర్స్‌ను అందుకున్న భాగ్యశ్రీ, మాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించనుంది. దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ “కాంత”లో హీరోయిన్‌గా భాగ్యశ్రీ ఎంపికైంది. పలు భాషల్లో అవకాశాలు అందుకుంటున్న ఈ అందాల తార భవిష్యత్‌లో తన సినిమాలతో ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.