మరో ఐదు రోజుల్లో ఈ పాటికి నేలకొండ భగవంత్ కేసరి అరాచకం గురించి మాట్లాడుకుంటాం. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొల్పాయి. ముందు నుంచి అనీల్ రావిపూడి దర్శకుడు కాబట్టి విజిల్స్ వేయించే డైలాగ్స్, గూస్‌బంప్స్ తెప్పించే సీన్లు గట్రా ఉండవేమో అని అందరిలో చిన్న డౌట్ ఉండేది.
కానీ టీజర్, ట్రైలర్‌లు రిలీజయ్యాక.. అసలు సిసలైన బాలయ్య మాస్‌ను ఈ సినిమాలో చూడబోతున్నాం అని ఓ క్లారిటీ వచ్చేసింది. బీ, సీ సెంటర్‌ల ఆడియెన్స్ ఏవేవి కోరుకుంటో అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు స్పష్టం అయింది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం రప్పించే కంటెంట్ ఈ సినిమాలో ఉందని అనీల్ హింట్ ఇచ్చేశాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాకుండా సినిమా చూసిన తర్వాత సెన్సార్ వాళ్లు సినిమా బాగుందని టీమ్‌ను అప్రిషియేట్ చేసిందట. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ అరాచకమట. మరీ ముఖ్యంగా బాలయ్య స్కీన్ర్ ప్రజెన్స్‌కు థమన్ పూనకాలు తెచ్చే రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చాడట ఇంటర్వెల్ సీన్‌కు సీట్‌లలో ఒక్కరు కూడా కూర్చోరని.. థియేటర్‌లు దద్దరిల్లిపోతాయని సెన్సార్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూస్తామట.
ఇక ఈ సెన్సార్ రిపోర్ట్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఇక ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతుందని ఇన్‌సైడ్ టాక్. రెండు తెలుగు రాష్టాల్లో ఈ సినిమాకు సుమారుగా రూ.60 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుంటే మరో రూ. 20 కోట్లు ఈజీగా బిజినెస్ జరుగుతుందట. మొత్తంగా చూసుకుంటే బాలయ్య కెరీర్‌లోనే అత్యధికంగా రూ.80 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుపుకుంటుందట.
ఇది బాలయ్య కెరీర్‌లో ఆల్‌టైమ్ రికార్డు. పోటీగా లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలున్నా ఈ రేంజ్‌లో బాలయ్య సినిమాకు బిజినెస్ జరుగుతుందంటే మాములు విషయం కాదు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ్గªన్ స్కీన్ర్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.