“భగవంత్ కేసరి” ఫేక్ వసూళ్ల ముచ్చట??

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “భగవంత్ కేసరి” రిలీజ్ అయ్యి మంచి టాక్ ని వరల్డ్ వైడ్ గా సంతరించుకుంది. కాగా దసరా బ్లాస్ట్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ అందుకుంది.

అలాగే రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించింది కానీ ఈ చిత్రం వసూళ్ల పరంగా మాత్రం మేకర్స్ ఫేక్ నంబర్స్ పెడుతున్నారు అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు 70 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా ఈ చిత్రం నంబర్స్ రాంగ్ అని కొందరు ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

భగవంత్ కేసరి వసూలు చేసిన వాటిలో నెక్స్ట్ డే నుంచి డ్రాప్ ఉన్నది వాస్తవం కానీ అలాగని ఫేక్ నంబర్స్ ని స్ప్రెడ్ చేస్తున్న వారి మాటలో కూడా నిజం లేదట. సినిమాని నిజంగానే తెలుగు రాష్ట్రాల మొత్తం ఈ ఆదివారం కూడా బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి.

దీనితో ఇప్పటివరకు వచ్చిన అనౌన్స్ చేసిన వసూళ్లతో కొంచెం మాత్రమే తేడా ఉంటుంది తప్ప భారీ మొత్తంలో అయితే డిఫరెన్స్ ఉండదు అని తెలుస్తుంది. అంతే తప్ప భగవంత్ కేసరి కి భారీ మొత్తంలో అయితే ఫేక్ వసూళ్లు పెట్టలేదని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది.