లేటెస్ట్ గా టాలీవడ్ లో మరో బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో అయితే మొదట టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలయ్య మరియు దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం ఒకటి కాగా ఈ చిత్రం మంచి అంచనాలు మధ్య వచ్చి మంచి రేటింగ్స్ సహా టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి పెట్టుకున్న చిన్న సక్సెస్ మీట్ లో అయితే అనిల్ రావిపూడి ఓ రివ్యూ విషయంలో చాలా సీరియస్ అవ్వడం వైరల్ గా మారింది. సినిమాలో హీరోయిన్ కి ఒక ఫోబియా ఉంటుంది పైగా తన నాన్న లాంటి వ్యక్తి తో కలిసి ఉంటుంది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి గ్లామర్ చూపించలేదు సాంగ్స్ పెట్టించలేదు రొమాన్స్ లేదని రాస్తున్నారు ఇదేమి బాగాలేదని విరుచుకుపడ్డారు.
దీనితో ఆ రివ్యూ ఎవరు ఎక్కడ రాసారు అనేది వైరల్ గా మారింది. దీనితో ఈ విషయంలో మాత్రం దర్శకుడు అనీల్ రావిపూడి బాగా హర్ట్ అయ్యాడని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా ఆసక్తికరంగా కాజల్ కోసం మాత్రం ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. ఇంకా ఈ చిత్రానికి అలాగే థమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి స్టడీ వసూళ్లతో వెళ్తుంది.
కానీ లాంగ్ రన్ లో మాత్రం భగవంత్ కేసరి బాలయ్య గత చిత్రాల్లా ఆ రేంజ్ వసూళ్లు అందుకొని గట్టెక్కడం కొంచెం కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.