ఎందుకొచ్చిన ‘ఛత్రపతి’ మాస్టారూ.!

అప్పుడెప్పుడో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా గుర్తుందా.? ఎలా మర్చిపోగలం.? అప్పట్లో ప్రభాస్‌కి అది అతి పెద్ద హిట్టు.! శ్రియ హీరోయిన్‌గా నటించింది ఆ సినిమాలో. ఆ పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయ్.

ఆ ‘ఛత్రపతి’ సినిమాని అదే పేరుతో హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అదీ మన తెలుగు హీరో, మన తెలుగు దర్శకుడు కలిసి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘ఛత్రపతి’ హిందీ వెర్షన్ రూపొందింది.

మధ్యలోనే సినిమా ఆగిపోయిందన్నారుగానీ, ఎలాగోలా పూర్తి చేసేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తున్నారట. ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. తాజాగా వచ్చిన ప్రోమోలో కొత్తదనం ఏమీ లేదు. మక్కీకి మక్కీ దించేశారంతే.

ఆమాత్రందానికి రీమేక్ ఎందుకు.? డబ్బింగ్ వెర్షన్ యూ ట్యూబ్‌లో చూసేసుకోవచ్చు కదా.? అయినా, ప్రభాస్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని పోల్చగలమా.? మాస్ డైరెక్టరే అయినా, వినాయక్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్‌లో వున్నాడాయె.! రాజమౌళి సినిమాని చెడగొట్టొద్దు.. అంటూ ‘ఛత్రపతి’ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.