బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు సినిమాలతో పోటీ పడి మరీ తన సినిమా మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో దిగాడు. రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. చిత్ర బృందం సక్సస్ మీట్ ని నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ కొన్ని ఆసక్తి కరమైన వాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ సినిమా అల్లుడు శీను నుంచి తాజాగా వచ్చిన అల్లుడు అదుర్స్ వరకు అన్నీ కమర్షియల్ సినిమాలనే చేస్తున్నాడు.
కాగా బెల్లంకొండ శ్రీను నటించిన గత చిత్రం రాక్షసుడు మంచి సక్సస్ ని ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఆలుడు అదుర్స్ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ సినిమాకి మంచి వసూళ్ళు వస్తున్నాయని త్వరలో 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక తనయుడు బెల్లంకొండ శ్రీను నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో కమర్షియల్ అంశాల్ని కాస్త ఎక్కువగానే చూపించారని ఒప్పుకున్నారు. అలాగే బెల్లంకొండ సురేష్ .. అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ఏకంగా క్లాసిక్స్ శంకరభరణం- సప్తపది- సాగరసంగమం సినిమాల గురించి చెప్పుకొచ్చారు.
అంతేకాదు అల్లుడు అదుర్స్ లో కాస్త.. ఓవరాక్షన్ ఉందన్న విషయాన్ని సురేష్ అంగీకరించడమేగాక.. ఓవరాక్షన్ తో ఒక సినిమా సూపర్ హిట్ గా మారుతుందని కూడా చెప్పడం అతి అని అంటున్నారు. అల్లుడు అతిగా ప్రవర్తించడం కమర్షియల్ అంశమని అన్నారు. ఏం చేసినా సినిమా కమర్షియల్ హిట్ అవడమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇక ఇదే వేదికపై సోనూసూద్ సేవాగుణాన్ని.. మూవీలో తన ఎంట్రీని ఆకాశానికెత్తేశారు సురేష్. అంతేకాదు దిల్ రాజును విమర్శించిన నిజాం పంపిణీదారు శ్రీను గురించి బెల్లంకొండ సురేష్ ..దిల్ రాజు – శిరీష్ ని నిందించడానికి శ్రీనుకు హక్కు లేదని అభిప్రాయపడ్డారు. ఈ ఆసక్తి కరమైన వ్యాఖ్యలే ఇప్పుడు ఒకరకంగా అల్లుడు అదుర్స్ సినిమాని రిస్క్ లో పడేస్తున్నాయా అన్న మాట వినిపిస్తోంది.