అందుకే హాట్ బ్యూటి నభా నటేష్ అంటే ఫ్యాన్స్ పడి చస్తున్నారు ..?

టాలీవుడ్ లో నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైన నభా నటేష్ ఆ తర్వాత పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సస్ అందుకొంది. ఈ సినిమా సక్సస్ తో నభా టాలీవుడ్ లో వరసగా సినిమా అవకాశాలు వచ్చి ఒళ్ళో పడుతున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో నటించిన నభా మరోసారి రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ లో రుపొందే సినిమాలో అవకాశం అందుకుందని సమాచారం.

అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ అన్న సినిమాలో నభా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే మెగా హీరో సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా కంప్లీట్ చేసింది. ఈ సినిమా తో మరో హిట్ గ్యారెంటీగా అందుకుంటున్నానన్న ధీమాగా ఉంది నభా. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

ఇంతలో నభా చేతిలోకి మరో సినిమా వచ్చింది. యంగ్ హీరో నితిన్ నటించబోతున్న బాలీవుడ్ సూపర్ హిట్ అంధాదున్ తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా నభా నటేష్ ని ఎంచుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఇలా వరసగా మంచి ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకుంటూనే తనలో ఉన్న మరో టాలెంట్ ని బయట పెట్టి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసింది.

తనకి ఎంతో ఇష్టమైన బ్యాట్ మాన్ బొమ్మ గిసింది. ప్రొఫెషనల్ పేయింటర్ గా చాలా అద్భుతంగా గీసిన ఈ బొమ్మ జనాలను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది కూడా. నభా నటేష్‌కు డీసీ కామిక్ ఫిక్షనల్ క్యారెక్టర్ బ్యాట్ మాన్‌ అంటే ఎంతో ఇష్టమని తనలోని టాలెంట్ ఉపయోగించి బ్యాట్ మ్యాన్ పెయిటింగ్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ హాట్ బ్యూటీలో ఉంత టాలెంట్ ఉందా అంటూ పొగడ్తలతో నభా ని అందరూ ముంచేస్తున్నారట.