శ్రీదేవి కారణంగా అతని చేతిలో తిట్లుతిన్న తేజ.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ విధంగా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తేజ కెరియర్ మొదట్లో క్లాప్ బాయ్ గా పనిచేశారు. ఇలా క్లాప్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా అలాగే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అంచలంచలగా ఎదుగుతూ వచ్చారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ కెరియర్ మొదట్లో శ్రీదేవి కారణంగా తాను తిట్లు తిన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే శ్రీదేవి గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ శ్రీదేవి హీరో హీరోయిన్లు తెరకెక్కిన సినిమా క్షణక్షణం.ఈ సినిమాకి గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇక తేజ ఒకవైపు క్లాప్ బాయ్ గా పనిచేస్తూనే మరోవైపు కెమెరాలను కూడా సెట్ చేసే పని తనపై వేసుకున్నారు. ఇకపోతే షూటింగ్ విరామ సమయంలో శ్రీదేవి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఆమె వెనుక ఒక లైట్ పడుతుండడం గమనించారు. ఈ క్రమంలోనే శ్రీదేవి గారు గోపాల్ రెడ్డి గారిని పిలిచి లైట్ సెట్ చేయమని చెప్పారు.

శ్రీదేవి ఇలా చెప్పేసరికి గోపాల్ రెడ్డి గారు తనని పిలిచి ఇష్టం వచ్చినట్లు తిట్టారని ఆయన అలా తిట్టేసరికి పక్కకు వెళ్లి తన పని తాను చూసుకోకుండా ఇలాంటి విషయాలన్నీ తనకెందుకు అంటూ శ్రీదేవిని తిట్టుకున్నానని తేజ తెలిపారు.అయితే తాను డైరెక్టర్ అయిన తరువాతే లైట్ అలా పడితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అర్థమైందని ఈ విషయంలో శ్రీదేవి డెడికేషన్ ,ఖచ్చితత్వం నిజంగా చాలా గొప్పది అని తేజ గారు అప్పుడు అనుకున్నారట. ఈ విధంగా శ్రీదేవి వల్ల తాను తిట్లుతిన్న విషయాన్ని తేజ ఈ సందర్భంగా బయటపెట్టారు.