Bandla Ganesh: చిరు, బాలయ్య అవార్డులపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Bandla Ganesh: ప్రముఖ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అనంతరం నిర్మాతగా మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు.

ఇలా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాణం పోయినా బి ఆర్ ఎస్ గురించి గొప్పగా చెప్పనని ఇక నేను కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు రానని తెలిపారు. నాకు ఎంత సన్నిహితులైన చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీలు పెట్టిన నేను అటువైపు వెళ్ళలేదని తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు చిరంజీవి బాలకృష్ణ అవార్డుల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.బాల‌కృష్ణ‌కు ప‌ద్మ‌వీభూష‌ణ్‌, చిరంజీవికి భార‌త రత్న వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ చర్చలపై మీ స్పందన అభిప్రాయం ఏంటి అని ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ వారిద్దరికీ ఈ అవార్డులు వస్తాయి అనే నమ్మకం నాకు ఉందని తెలిపారు.

చిన్న వ‌య‌సులోనే స‌చిన్ టెండూల్క‌ర్ కు కూడా భార‌త‌రత్న ఇచ్చారు. మెగాస్టార్ కు కూడా 200 శాతం ఉంది.. ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ తరువాత తరం నటుడిగా చిరంజీవి ఎంతో మంచి గుర్తింపు పొందారు ఇప్పటికే ప‌ద్మ విభూష‌ణ్ మెగాస్టార్ మ‌ణిహారంలో చేరింది. భార‌త‌ర‌త్న త‌ర్వాత రెండ‌వ అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ‌విభూష‌ణ్. 2006లో ప‌ద్మ‌భూష‌ణ్ చిరంజీవి అందుకున్నారు. గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డులోనూ మెగాస్టార్ చోటు సంపాదించారు ఇటీవల ఏఎన్ఆర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఖచ్చితంగా చిరంజీవికి భారతరత్న, బాలయ్యకు ప‌ద్మ‌వీభూష‌ణ్‌ అవార్డులు వస్తాయి అంటూ ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.