గత కొద్దిరోజులుగా భూమా మౌనిక మంచు మనోజ్ రిలేషన్ గురించి వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.భూమా మౌనిక మంచు మనోజ్ ఇద్దరు చెన్నైలో గత రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.అయితే వీరిద్దరికీ పెళ్లి చేయడం ఇటు మంచు కుటుంబానికి అటు భూమా కుటుంబానికి కూడా ఇష్టం లేదనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
ఇక శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలలో భాగంగా భూమా కుటుంబ సభ్యులందరూ కూడా వారిఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ మౌనిక కూడా అక్కడికి రావడంతో అఖిలప్రియ వారితో ఏ మాత్రం మాట్లాడలేదని వారు వెళ్లే వరకు అఖిలప్రియ తమ తల్లిదండ్రుల ఘాట్ వద్దకు రాలేదని సమాచారం. అయితే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అఖిల ప్రియకు వ్యతిరేకంగా మౌనిక రెడ్డి ఎన్నికలలో పోటీ చేయబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మౌనిక రెడ్డి టిడిపి పార్టీ తరపున ఆళ్లగడ్డలో వచ్చే ఎన్నికలలో పోటీ చేయనుందని సమాచారం. ఈ క్రమంలోనే బాలకృష్ణ మద్దతుతో ఈమె తన అక్క పై విజయం సాధించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా బాలకృష్ణ రాజకీయాల పరంగా మాత్రమే కాకుండా మౌనిక మనోజ్ వివాహానికి కూడా సపోర్టుగా నిలుస్తున్నారని ఆయన ఆశీర్వాదంతోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి. మరి మనోజ్ మౌనిక వివాహం గురించి, వీరి రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.