బాలయ్య డామినేషన్..”వాల్తేరు వీరయ్య” వెనక్కి.?

మరికొన్ని రోజుల్లో అయితే మన టాలీవుడ్ లో భారీ బాక్సాఫీస్ క్లాష్ కి సిద్ధం అవుతుంది. తెలుగు సినిమాలు సహా తమిళ సినిమాలు ఉన్నాయి కానీ మన తెలుగు స్టేట్స్ లో మాత్రం చాలా కాలం తర్వాత ఇద్దరు పెద్ద స్టార్ లు నందమూరి బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలు “వాల్తేరు వీరయ్య” అలాగే “వీరసింహా రెడ్డి” చిత్రాలు ఉన్నాయి.

మరి ఈ చిత్రాలు ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీస్ అవుతుండగా ఎప్పటిలానే మెగాస్టార్ సినిమా డామినేషన్ ఉంటుంది అనుకుంటే ఈసారి మాత్రం బాలయ్య ఓ రేంజ్ లో పోటీ ఇస్తున్నాడు. వాల్తేరు వీరయ్య కన్నా కొద్దిగా ఎక్కువ లొకేషన్స్ లోనే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కాగా వాల్తేరు వీరయ్య కన్నా బాలయ్య సినిమాకే ఎక్కువ బుకింగ్స్ నమోదు అవుతుండడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

దీనితో ఈసారి మాత్రం బాలయ్య డామినేషన్ గట్టిగా ఉండేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది మొదలు మాత్రమే కాగా సినిమా రిలీజ్ నాటికి అయితే మరింత క్లారిటీ ఈ లెక్కలో వస్తుందని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం బాలయ్యే డామినేట్ చేస్తూ చిరు సినిమాని వెనక్కి పెట్టాడు, మరి నెక్స్ట్ మెగాస్టార్ ఏమన్నా పుంజుకుంటాడేమో చూడాలి. కాగా ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మాణం వహిస్తున్నారు.