శ్రీలీల ఎంట్రీపై బాలయ్య డైరెక్టర్ క్రేజీ పోస్ట్.!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర ఆసక్తిగా వినిపిస్తున్న యంగ్ సెన్సేషన్ పేరు శ్రీ లీల. మొదటి సినిమా తోనే మంచి హిట్ అందుకొని నెక్స్ట్ సినిమాల్లో కూడా ఈ యంగ్ హీరోయిన్ తనదైన ప్రెజెన్స్ తో అందరి ద్రుష్టి ని బాగా ఆకర్షించి ఇంప్రెస్ చేసింది. దీనితో ఈమెకి ఇప్పుడు భారీ ఎత్తున ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి.

మరి ఈ ఆఫర్స్ లో మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ తో ప్లాన్ చేసిన భారీ సినిమా కూడా ఒకటి. బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా దర్శకుడు అనీల్ రావిపూడి దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కూడా ఈమె ఉన్నట్టుగా ఆల్రెడీ టాక్ ఉన్న సంగతి తెలిసిందే.

కాగా నిన్న అయితే ఈ అంశం పై అధికారిక అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు. ఈ సినిమాలో శ్రీ లీల కూడా నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై అయితే దర్శకుడు అనీల్ రావిపూడి శ్రీ లీల కి ఇంట్రెస్టింగ్ వెల్కమ్ అందించాడు. మోస్ట్ టాలెంటెడ్ మరియు ఎనర్జిటిక్ అయినటువంటి శ్రీ లీల నటసింహ బాలయ్య గారితో చేతులు కలపడం ఆనందంగా ఉంది అని శ్రీ లీల తో ఈ సినిమా జర్నీ ఒక స్పెషల్ గా మారిపోతుంది అని తెలిపాడు.

కాగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అయితే కాజల్ ఫిక్స్ కాగా ఈమెపై కూడా అప్డేట్ రానుంది. అయితే శ్రీ లీల బాలయ్య కూతురి పాత్రలో నటించనుంది అని టాక్ ఉంది. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ ప్లాన్ లో ఉంది.