వరల్డ్ వైడ్ ఇంత టార్గెట్ తో దిగుతున్న బాలయ్య సినిమా..!

ఇపుడు తెలుగు సినిమా సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా బాక్సాఫీస్ దగ్గర మూవీ లవర్స్ కి దసరా మహోత్సవం కాస్త ముందే మొదలైంది. ఆల్రెడీ దసరా నవరాత్రుల్లోకి అడుగు పెట్టారు కానీ ముందే అయితే మూవీ లవర్స్ కి భారీ ట్రీట్ సిద్ధం అవుతుంది.

ఇక ఈ చిత్రాల్లో మన టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. మరి ఈ చిత్రంని దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించగా అభిమానులు ఆల్రెడీ ఈ ఏడాది వీరసింహా రెడ్డి హిట్ తో దీనిని కూడా మంచి హిట్ చెయ్యాలని చూస్తున్నారు.

కాగా ఈ చిత్రం కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా గట్టి అంచనాలే పెట్టుకొని వస్తుంది. కాగా ఈ చిత్రం అయితే వరల్డ్ వైడ్ బిజినెస్ పై ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దీంతో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా జస్ట్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 70 కోట్ల మేర జరుపుకుందట.

కాగా ఇది తన గత వీరసింహా రెడ్డి సినిమాతో సమానంగా జరిగింది అని చెప్పొచ్చు. అయితే ఇపుడు ఉన్న టైం లో పోటీ గట్టిదే కానీ హిట్ అయితే మాత్రం వసూళ్లు వచ్చేస్తాయని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గ కాజల్ అగర్వాల్ నటించగా శ్రీ లీల బాలయ్య కూతురి పాత్ర చేసింది. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మాణం వహించారు.