జై బాలయ్యా.! ఇది కొత్త అవతారమయ్యా.!

కొన్నాళ్ళ క్రితం వరకూ నందమూరి బాలకృష్ణ పరిస్థితి వేరు. ఇప్పుడు మారిన ఈక్వేషన్స్ వేరు.! ‘వీరసింహా రెడ్డి’ సంక్రాంతి రేసులో కొట్టుకుపోయిందిగానీ, నిజానికి అదో ఫ్లాప్ మూవీ.. అనేవారూ లేకపోలేదు.

ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాల మార్కెట్ వంద కోట్లు.. ఆ పైన వుండబోతున్నాయట. నిజానికి, ఈ లెక్కల విషయమై ట్రేడ్ వర్గాల్లో భిన్న వాదనలున్నాయి. ‘భగవంత్ కేసరి’కి అనిల్ రావిపూడి కారణంగా మంచి బజ్ ఏర్పడింది ట్రేడ్ వర్గాల్లో. అనిల్ రావిపూడికి బాలయ్య ఇమేజ్ అదనపు బోనస్. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమా కూడా వంద కోట్లు.. ఆ పైన మార్కెట్‌ని టచ్ చేయబోతోంది.

బాలయ్య స్టామినా లెక్కల్లోకి తీసుకుంటే, బిజినెస్ లెక్కలు అమాంతం పెరిగిపోయాయి. రాబడి భయాలు నిర్మాతలకేగానీ, బాలయ్యకి కాదు కదా.! బడ్జెట్ కూడా అలాగే వుండాలని బాలయ్య షరతులు పెడుతున్నాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.