బాలయ్య మామూలోడు కాదు సుమీ.!

ఇటు రాజకీయం, అటు సినిమా.. రెండిటినీ భలేగా చక్కబెట్టేస్తున్నాడు సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. గతంలో ఎన్నడూ లేని విధంగా, నందమూరి బాలకృష్ణ.. సైలెంటుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు.

సినిమాల పరంగానూ.. రాజకీయాల పరంగానూ.. నందమూరి బాలకృష్ణ తెరవెనుకాల చేస్తున్న సినీ రాజకీయం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. బాలయ్య అందరివాడు.. బాలయ్య మంచోడు.. బాలయ్య అగ్ర కథానాయకుడు.. బాలయ్య అంటే, ఇప్పుడస్సలు నెగెటివిటీనే లేదు.. సినిమాల్లోనూ, అలాగే.. రాజకీయాల్లోనూ. తానా సభలకోసం అమెరికా వెళ్ళిన బాలయ్య, అక్కడ తన చుట్టూ కులపరమైన రచ్చ జరగకుండా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.

వచ్చే ఎన్నికలకు సంబంధించి.. బాలయ్య తనను తాను మార్చుకున్న వైనం.. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కాదు కాదు, ఇది పెద్దరికం.. సినీ పరిశ్రమలో పెద్దరికం.. అని తెరవెనుకాల గుసగుసలు వినిపిస్తున్నాయ్.