Balakrishna: బాలయ్య పుట్టినరోజు మర్చిపోకుండా వసుంధర చేసే పని ఏంటో తెలుసా?

Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా అపజయం ఎరుగని నాయకుడిగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. త్వరలోనే ఈయన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈయన పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అఖండ 2 టీజర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇలా అఖండ 2 నుంచి అద్భుతమైన టీజర్ రావడంతో అభిమానులు బాలయ్య పుట్టినరోజును మరింత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇక బాలయ్య పుట్టినరోజు అంటే ప్రతి ఏడాది తన భార్య వసుంధర తప్పనిసరిగా ఓ పని చేస్తారని తెలుస్తోంది. మరి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వసుంధర చేసే పని ఏంటి అనే విషయానికి వస్తే… బాలకృష్ణ పుట్టినరోజున ఈమె ఎంతోమంది అనాధలకు అన్నదానం చేయించడమే కాకుండా వారికి నూతన వస్త్రాలను కూడా అందచేస్తారని తెలుస్తుంది. ఇలా ప్రతి ఏడాది బాలయ్య పుట్టినరోజు ఈ పనిని వసుంధర మర్చిపోకుండా చేస్తారని బాలయ్య హైదరాబాదులో ఉన్న లేక సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలలో ఉన్న ఈమె మాత్రం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.