బలగం కలెక్షన్స్.. పెట్టింది వచ్చేసింది!

దిల్ రాజు కూడా చిన్న సినిమాలను నిర్మించేందుకు మరో కొత్త ప్రొడక్షన్ ను స్థాపించిన విషయం తెలిసిందే. వారి వారసులు దిల్ రాజు కొత్త ప్రొడక్షన్ ను కొనసాగిస్తూ చిన్న బడ్జెట్ లోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీనియర్ కమెడియన్ వేణు దర్శకత్వంలో బలగం అనే ఒక సినిమాను నిర్మించారు.

ప్రియదర్శి హీరోగా తెరపైకి వచ్చిన బలగం సినిమా వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచి కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాకు కలెక్షన్స్ వీకెండ్ లో కూడా గట్టిగానే వచ్చాయి.

మొదటి రోజు కేవలం 55 లక్షల గ్రాస్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత 80 లక్షల్లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఆదివారం రోజు 1.75 కోట్ల గ్రాస్ అందుకుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా మొత్తంగా మొదటి వీకెండ్ లో సినిమాకు 3.15 కోట్ల గ్రాస్ రావడం విశేషం. ఇక 1.32 కోట్ల షేర్ వచ్చింది. ఇక బలగం సినిమా మొత్తంగా 115 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పిక్స్ కాగా సినిమా ఆ టార్గెట్ ను చాలా తొందరగానే ఫినిష్ చేసుకోవడం విశేషం. ఇక ఈ వారంలో సినిమాకు ఎంత కలెక్షన్స్ వస్తే అంత పూర్తిస్థాయిలో నిర్మాతకు లాభం చేకూరుతుంది. మొత్తానికి పెట్టిన పెట్టుబడి అయితే వెనక్కి వచ్చింది. కాబట్టి ఈ సినిమా మిగిలిన ఈ వారంలో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.