బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న లేడీ డైరెక్టర్ ..!

సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అంత తక్కువమంది ఉన్నారు. కాని ఆ ఉన్న కొద్ది మంది సూపర్ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకుంటున్నారు. అలా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన దర్శకురాలు సుధ కొంగర. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దగ్గర దాదాపు 7 ఏళ్ళు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేశారు. అలాగే మంచి రచయిత కూడా. సుధ కొంగర లో మంచి రచయిత ఉండటమే ఈ రోజు దర్శకురాలిగా సక్సస్ అవడానికి ప్రధాన కారణం అయింది.

Saala Khadoos' director Sudha Kongara makes her guru Mani Ratnam proud -  Bollywood Bubble

ముందు నుంచి కోలీవుడ్ లో పనిచేసి అక్కడ బాగా గుర్తింపు పొందారు. మణిరత్నం దగ్గర పనిచేస్తున్నప్పుడే మాధవన్ తో పరిచయం పెంచుకుంది. “సాలె ఖడూస్” సినిమాతో బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ గా నిలవడంతో ఇదే సినిమాని తమిళంలో “ఇరుది సుత్రు” గా రూపొందించింది సుధ కొంగర. కాగా ఈ సినిమాతో తమిళంలో ఉత్తమ దర్శకుడు ఫిలింఫేర్ అవార్డు సాధించారు. ఇక ఇదే కథ తో తెలుగులో విక్టరీ వెంకటేష్ తో గురు తీశారు. తెలుగులో తీసిన మొదటి సినిమా గురు తోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Aakasam Nee Haddu Raa Review | Soorarai Pottru Movie Review

ఇక ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో “సూరరై పొత్రు” అన్న సినిమా రూపొందించారు. ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజై భారీ సక్సస్ ని అందుకుంది. అంతేకాదు తెలుగులోనూ ఆకాశం నీ హద్దురా అన్న పేరుతో రిలీజై తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాని ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి.ఆర్. గోపీనాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కించడం విశేషం. అయితే ఇప్పుడు సుధ కొంగర మరో సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సూర్య సోదరుడు కార్తి హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది.