బాక్సాఫీస్ : తగ్గని “బేబీ” జోరు..ఆగని వసూళ్లు హోరు.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ చాలానే తగిలాయి. బాక్సాఫీస్ దగ్గర మైండ్ బ్లాకింగ్ రన్ ని అయితే సెట్ చేసిన ఈ చిత్రాల్లో ఇప్పుడు దుమ్ము లేపుతున్న మరో చిత్రమే “బేబీ”. యంగ్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించి వీరి అందరి కెరీర్ లలో సెన్సేషనల్ హిట్ గా అందుకున్నారు.

అయితే ఇప్పుడు రెండో వారం లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం రెండో వారం మొదటి రోజు తోనే ఊహించని విధంగా 50 కోట్ల మార్క్ ని కొట్టేసింది. అయితే 8వ రోజు మొత్తం కంప్లీట్ అయ్యే సరికి 54 కోట్లు రాబట్టగా 9వ రోజుకి అయితే ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా మరో మార్క్ 60 కోట్లు కొట్టేసింది.

దీనితో ఈ చిత్రం అసలు ఏ లెవెల్లో పెర్ఫామెన్స్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కాగా బేబీ ఈ 9వ రోజు ఏకంగా 6 కోట్ల గ్రాస్ ని అందుకొని సెన్సేషన్ సెట్ చేసింది. దీనితో కేవలం ఈ 9 రోజుల్లో 60.3 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టింది. ఇక ఈ ఆదివారం కూడా ఇదే రేంజ్ వసూళ్లు ఉంటాయని చెప్పొచ్చు.

అలాగే బ్రో సినిమా లోపు ఈ చిత్రం 80 కోట్లు ఫుల్ లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. మరి ఈ సెన్సేషనల్ ఫీట్ ని అయితే ఈ చిత్రం అందుకుంటుందో లేదో అనేది కూడా చూడాలి. కాగా ఈ చిత్రానికి అయితే విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం అందించగా మాస్ మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.