హృదయ కాలేయం సినిమాతో ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్న రాజేష్ బేబీ లాంటి సినిమాను తెరపైకి తీసుకు వస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఆ సినిమా సక్సెస్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా మొదట రన్ టైం చూసి త్రీ యూనిట్ సభ్యులు అందరూ కూడా షాక్ అయ్యారట.
మొదట కట్ లో దాదాపు 5 గంటల 25 నిమిషాల వరకు సినిమా నిడివి వచ్చిందట. ఇక దానికి తగ్గించడానికి చిత్ర యూనిట్ పడిన కష్టాలు అన్ని కాదు అని దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఫుల్ రష్ చూసుకున్న తర్వాత చిత్ర నిర్మాత SKN ఒక్కసారిగా గుండె పట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత మరొక ఎడిటర్ను తీసుకు రాగా ఫస్ట్ ఆఫ్ గంట 50 నిమిషాలు ఇక సెకండ్ హాఫ్ రెండు గంటలకు పైగా వచ్చింది.
ప్రతి సీన్ బాగుందని అనిపించిన ఆ సినిమా రన్ టైం 3 కంటే తక్కువ ఎలా తగ్గించాలో అర్థం కాలేదు. ఇక చివరికి ఎస్కేన్ మారుతీ కలిసి కూర్చొని సినిమాను వీలైనంత ఎక్కువగా కట్ చేస్తూ వెళ్లారు. ఇక చివరకు ఈ సినిమా రన్ టైం 3 గంటలు ఫైనల్ అయింది. ఇక అప్పుడు బన్నీ వాసు వచ్చి ఇంతకుమించి సినిమా రన్ టైం తగ్గించకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన నిర్ణయం కరెక్ట్ అనిపించి. 3 గంటలు ఉన్నా కూడా ఎంతో నమ్మకంతో సినిమాను విడుదల చేసామని ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అని సాయి రాజేష్ తెలియజేశాడు.