బాక్సాఫీస్ : డే 1 వరల్డ్ వైడ్ “బేబీ” కి ఊహించని ఓపెనింగ్స్.!

ఇపుడు ఉన్న టైం అండ్ ట్రెండ్ లో అయితే ఓ చిన్న సినిమాకి మంచి అటెన్షన్ వచ్చి మంచి వసూళ్లు రిజిస్టర్ అవ్వడం అనేది చాలా పెద్ద అంశం. అలా లేటెస్ట్ గా చాలా వరకు పెద్దగా స్టార్ కాస్ట్ ఏది లేకుండానే వచ్చిన లేటెస్ట్ సినిమానే “బేబీ”.

దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి వచ్చి ఫేమస్ అవుతున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అయితే నటించింది.

కాగా ఈ చిత్రంపై నమ్మకంతో అయితే అయితే ముందే ప్రీమియర్ షోస్ వేసి హిట్ టాక్ తెచ్చుకున్న మేకర్స్ ఇక నిన్న శుక్రవారం మొత్తం రిలీజ్ చేసి మొదటి రోజు వరల్డ్ వైడ్ ఉహించని ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

అయితే ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 7 కోట్ల దగ్గర మేర గ్రాస్ ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇది అయితే ఈ చిత్రానికి నిజంగా చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. మేజర్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక్కసారిగా ఊపందుకుంది.

దీనితో చాలా మంది 3 కోట్లు అలా రావచ్చు అనుకున్నారు కానీ ఈ చిత్రానికి అనూహ్యంగా 7 కోట్ల దగ్గర వసూళ్లు వచ్చేసాయి. దీనితో మరోసారి యూత్ ఈ సినిమాకి పెద్ద హిట్ చేసేలా ఉన్నారని చెప్పాలి. మరి ఫైనల్ రన్ లో ఐతే ఎక్కడివరకు ఈ చిత్రం వెళ్లి ఆగుతుంది అనేది కూడా చాలా మందిలో ఆసక్తి నెలకొంది.