అప్పుడు ప్రియమణి ఇప్పుడు పూర్ణ.. బాబా భాస్కర్ రచ్చ రచ్చే!!

బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉండాల్సిందే. బాబా భాస్కర్ అంటేనే ఎంటర్టైన్మెంట్. బాబా భాస్కర్ అంటే ఎలాంటి వాడో అని బిగ్ బాస్ షోలో మనమంతా చూశాం. కొంత ఫేవరిటిజం చూపించినా గానీ ఇంట్లో ఉన్నంత వరకు అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశాడు. అందరి మనసులను దోచుకున్నాడు. అందుకే దాదాపు చివరి వరకు ఉన్నాడు. విన్నర్ అవుతాడని కూడా అనుకున్నాడు కానీ టాప్ 4 వరకు వచ్చి వెళ్లిపోయాడు.

Baba Bhaskar Mass Steps With Poorna In Dhee

బిగ్‌బాస్ గోల కాసేపు పక్కనపెడితే.. బుల్లితెరపై బాబా మాస్టర్ చేసే సందడి అందరికీ తెలిసిందే. అలీతో సరదాగా, క్యాష్, అదిరింది, జబర్దస్త్, ఢీ ఇలా ఏ షోకు వెళ్లినా స్పెషల్ ఈవెంట్స్ చేసినా బాబా వచ్చాడంటే అక్కడ స్టేజ్ అదిరిపోవాల్సిందే. అందర్నీ ఉరుకులు పరుగులు పెట్టిస్తూ.. నవ్వించి చంపేస్తాడు. గత రెండు మూడు వారాలుగా ఢీ షోలో జడ్జ్‌గా వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. శేఖర్ మాస్టర్‌కు కరోనా రావడంతో గత నెల రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అందుకే శేఖర్ మాస్టర్ స్థానంలో బాబా మాస్టర్ దుమ్ములేపుతున్నాడు, ఇన్ని రోజుల్లో శేఖర్ మాస్టర్ కలపని పులిహోర.. బాబా రెండు మూడు ఎపిసోడ్‌లకే కలిపేశాడు. మొన్న ప్రియమణితో రొమాంటిక్ స్టెప్పులేసి ఫ్లాట్ చేసేశాడు. ఇక వచ్చే వారం పూర్ణతో కలిసి ఇరగదీసే మాస్ట్ స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. మన్మథ రాజా మన్మథ రాజా అనే ఊపున్న సాంగ్‌కు ఊగిపోయారు. వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో తాజాగా వీరిద్దరు దుమ్ములేపేశారు.