“సూర్య 42” అవైటెడ్ అప్డేట్ ఆరోజున.?

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కూడా ఒకటి. మరి తాను తన కెరీర్ లో చేస్తున్న 42వ సినిమా ఇది కాగా ఇంకా టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని రాకుండానే తమిళ సినిమా నాట బిజినెస్ జరిపిన సినిమాగా అయితే ఇది నిలిచింది.

దాదాపు 500 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఈ సినిమాకి జరిగినట్టుగా సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ కి గాను ఇంకా సమయం ఉండగా కొన్నాళ్ల నుంచి ఈ సినిమా తాలూకా టైటిల్ కోసం అయితే ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. దీనితో చిత్ర బృందం టైటిల్ రివీల్ కి గ్రాండ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా టైటిల్ ని ఓ క్రేజీ విజువల్స్ తో కూడిన ఓ టీజర్ వీడియోతో అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిని గాను ఈ మార్చ్ 14 నే రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే అభిమానులు కోరుకుంటున్న ఈ అప్డేట్ రాబోతుందని చెప్పాలి.

కాగా ఈ సినిమా కి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం విశేషం. అంతే కాకుండా బాలీవూడ్ హాట్ బాంబ్ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ చాలా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది దీపావళి కానుకగా అయితే ఈ సినిమాని 10 భాషల్లో 3డి లో రిలీజ్ చేస్తున్నారు.