టాలీవుడ్ కి యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ నుంచి వరసగా ఆఫర్స్ అందుకుంది. విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్, నాని – నాగార్జున లతో దేవదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలు చక చకా చేసేంది. ఈ సినిమాలలో డియర్ కామ్రేడ్, దేవదాస్ అట్టర్ ఫ్లాప్ అవగా గీత గోవిందం 100 కోట్ల క్లబ్ లో చేరింది.
అలాగే సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఈ ఏడాదే వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అంతే ఇక టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ లో రష్మిక నంబర్ 1 ప్లేస్ కి చాలా దగ్గరలో ఉంది. అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా బాగానే డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తయారవుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప లో హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ ముఖ్య పాత్ర లో కనిపిస్తుండగా ఇందులో చరణ్ కి జంటగా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ కాకముందే రష్మిక కి ఎంగేజ్‌మెంట్ అయి క్యాన్సిల్ అయింది. దాంతో నెటిజన్స్ తో రష్మిక ఎప్పుడు ముచ్చటించినా తప్పకుండా వాళ్ళు పెళ్ళి టాపిక్ తీసుకు వస్తుంటారు. అదీ కాక ఖాళీ సమయాలలో రష్మిక చేసే చిలిపి పనులు నెటిజన్స్ తో చేసే ఫన్నీ చాటింగ్ వల్ల పెళ్ళి టాపిక్ ఎక్కువగా వస్తుంది.
ఈ క్రమంలోనే రీసెంట్ గా ఒక నెటిజన్.. మిమ్మలిని పెళ్ళి చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. అంతే ఎప్పటిలాగే రష్మిక ఇచ్చిన సమాధానం అతనికే కాదు ఇకపై ఆ ప్రశ్న అడగాలనుకున్న ప్రతీ ఒక్కడికి బుర్ర గిర్రన తిరిగే సమాధానం ఇచ్చింది. ఇంతకీ రష్మిక ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా… వచ్చి
నా ముందు కూర్చిని మాట్లాడు అని. ఇంత పెద్ద సెలబ్రిటీ ముందు కూర్చొని ఒక కామన్ పర్సన్ పెళ్ళి గురించి మాట్లాడే దమ్ముంటుందా..!