అందరూ కలిసి రాత్రి రచ్చ రచ్చ.. కచ్చితంగా మిస్ అవుతానంటోన్న సురేఖా వాణి

ప్రస్తుతం సురేఖా వాణి ఎక్కడుందో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్‌లో సందడి చేస్తోంది. కూతురు సుప్రితను కూడా తీసుకెళ్లి అక్కడే ఎంజాయ్ చేస్తోంది. కూడా అజ్మీర్ దర్గాకు కూతుర్ని తీసుకెళ్లి ప్రత్యేకంగా దేవుడ్ని దర్శించుకుంది. రాజేంద్ర ప్రసాద్, రాధిక, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సురేఖా వాణి ముఖ్య పాత్రనే పోషిస్తోన్నట్టు తెలుస్తోంది.

Artist Surekha Vani Completes Shoot And Returns From Samode

అయితే ఈ మూవీ షూటింగ్ కోసం ముందు సురేఖా వాణి వెళ్లింది. ఓ పదిహేను రోజులు అక్కడే షూటింగ్‌లో పాల్గొని మళ్లీ వెనక్కి వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఓ రెండు మూడు రోజుల తరువాత కూతుర్ని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. అయితే ఈ చిత్రంలో సురేఖా వాణి పాత్ర చాలా లెంగ్తీగా ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే ఇన్ని రోజులు షూటింగ్‌లొ పాల్గొంది. ఎస్పీబీ మరణ వార్త తెలిశాక షూటింగ్ లొకేషన్‌లో అందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Artist Surekha Vani Completes Shoot And Returns From Samode

తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. యూనిట్ మొత్తం తిరిగి వచ్చేస్టున్నట్టు సమాచారం. ఈ మేరకు చిత్రయూనిట్ అంతా నిన్న రాత్రి పార్టీ చేసుకుని రచ్చ రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఇక షూటింగ్ జరిపిన రాజమహల్‌ను సురేఖా వాణి వీడలేక వీడలేక వచ్చినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్‌లోని సమోద్‌లో ఉన్న కోట గురించి చెబుతూ… నిన్ను కచ్చితంగా మిస్ అవుతాను.. ఎన్నో గొప్ప మెమోరీలను ఇచ్చావ్.. అంటూ సురేఖా వాణి తెలిపింది.