యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే నటిగా తమిళ..కన్నడలో నాలుగైదు సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కూడా ఆ మధ్య ఓ సినిమా లాంచే చేసారు. అందులో విశ్వక్ సేన్ హీరో. కానీ హీరోతో వివాదం కారణంగా అర్జున్ ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేసారు. అయితే నటిగా మాత్రం సక్సెస్ కాలేదు. ఐశ్వర్య సినిమాలు చేసి నాలుగేళ్లు దాటింది . చివరిగా 2018లో మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇదే ఏడాది తెలుగు సినిమా లాంచ్ అవ్వడం..ఆగిపోవడం అన్ని నెల రోజుల్లోనే జరిగిపోయాయి. అయితే ఇంతలోనే ఐశ్వర్య వివాహం చేసుకుంటుందని వార్తలొచ్చాయి. సినిమాలకు గుడ్ బై చెప్పి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతుందని ప్రచారం సాగింది.
ఇంతలోనే అర్జున్ రెండవ కుమార్తె అంజన కూడా తెరంగేట్రం చేస్తుందన్న వార్త టాలీవుడ్ లో విూడియాలో వైరల్ గా మారింది. ఇంతవరకూ వ్యాపారాల్లో బిజీగా ఉన్న అంజన సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందిట. దీనిలో భాగంగానే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమా ద్వారా అంజన పరిచయమవుతుందని ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. ప్రస్తుతం లొకేష్ తెరకెక్కిస్తోన్న ’లియో’ పూర్తికాగానే తదుపరి సినిమా మొదల వుతుందని..ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా లాంచ్ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే! అంజన లక్కీ బ్యూటీ అనే చెప్పాలి. లొకేష్ కి పాన్ ఇండియాలో గుర్తింపు ఉన్న దర్శకుడు. అ
తని సినిమాకి అన్ని భాషల్లో డిమాండ్ ఉంది. టాలీవుడ్ హీరోలే అతనితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లొకేష్ సినిమాతోనే లాంచింగ్ అంటే లక్కీనే. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. ఐశ్వర్య విషయంలో లాంచింగ్ సింపుల్ గా జరిగిపోయింది. ’పట్టాతు యానై’ అనే కోలీవుడ్ సినిమాతో ఐశ్వర్య ప్రవేశించింది. అందులో విశాల్‌కి జోడీగా నటించింది. కానీ ఆ సినిమా సరైన ఫలితాలు సాధించలేదు.