యాక్షన్ సింగ్ అర్జున్ అందరికీ పరిచయమే. ఆయన సినిమాలు ఇప్పుడు కాస్త రావడం తగ్గాయి కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన తన సత్తా చాటారు. కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా తన ప్రతిభను అందరికీ పరిచయం చేశారు. ఫైట్ సీన్స్ అద్భుతంగా చేయాలి అంటే, ముందుగా ఆయన పేరే వినిపించేది. ఆ తర్వాత ఆయన సినిమాలు కాస్త దూరమయ్యారు.
అయితే, తన వారసురిలాగా ఆయన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆమె 20213లో హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించింది. తమిళం, కన్నడలో ఆమె హీరయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా తీసుకురావాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కాగా, ఇప్పుడు ఆయన తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
ఆమె పెళ్లి చేసుకునేది కూడా ఓ ప్రముఖ నటుడేనట. అయితే అతను ఓ కమెడియన్ కావడం విశేషం. తమిళనాట ప్రముఖ హాస్యనటుడితో ఐశ్వర్య పెళ్లి జరుగుతోందంటూ ప్రచారం జరుగుగతోంది. ఐశ్వర్య తమిళ సీనియర్ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య తో ప్రేమలో ఉందట. వీరిద్దరూ చాలాకాలం నుంచే ప్రేమించుకుంటున్నారట. కాగా, వీరి పెళ్లికి తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన మాత్రం వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఊపందుకుంటోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే, ఇరువురి కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఐశ్వర్యను అర్జున్ తెలుగు తెరకు కూడా పరిచయం చేయాలని అనుకున్నారు. ఓ సినిమా కూడా మొదలుపెట్టారు. అందులో విశ్వక్ సేన్ ని హీరోగా అనుకున్నారు. షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ విశ్వక్, హీరో అర్జున్ మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విశ్వక్ ఆ సినిమా కు దూరమయ్యాడు. ఆ తర్వాత సినిమా ఆగిపోయింది, లేదంటే వేరే హీరోతో తీస్తున్నామని కానీ, ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.