అప్సర రాణి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవడానికి ఆ ఇద్దరు ఇంత ట్రై చేస్తున్నారా ..?

ఆర్జీవి ఏం చేసినా సంచలనం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఏసీ రూమ్ లో కూర్చొని ఒక ట్వీట్ చేసి దేశాన్ని మొత్తం కదిలిస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ నుంచి మొన్న మొన్న ఆయన గ్రాండ్ గా పరిచయం చేసిన అప్సర రాణి వరకు తన ఒక్క ట్వీట్ తో పాపులారిటి వచ్చేలా చేస్తాడు. మంచి చెడు అన్నది పక్కన పెడితే ఆర్జీవి వల్ల చాలా మందికి లైఫ్ వస్తుంది. అందుకు ఉదాహరణ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంటున్న కంటెస్టెంట్ అరియానా .. అప్సర రాణి..
శ్రీ రాపాక.

Director Ram Gopal Varma Praises Anchor In Interview | Ram Gopal Varma  About Desires | Manastars - YouTube

యూట్యూబ్ యాంకర్ గా ఉన్న అరియానా ఏకంగా బిగ్ బాస్ లో వచ్చి చేరిందంటే అది ఆర్జీవి పుణ్యమే. అరియానా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో తన థైస్ మీద ఒక కామెంట్ చేశాడు. అంతే అరియానా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. అందరూ అరియానా గురించి గూగూల్ లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇక శ్రీరాపాక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అయినా పెద్దగా గుర్తింపు లేదు. కాని తనతో ఆర్జీవి నగ్నం అన్న సినిమా తీసి క్రేజీ హీరోయిన్ గా మార్చేశాడు.

Sri Rapaka speaks about 'Commitment' and RGV's madness | TeluguBulletin.com

ఇప్పుడు అప్సర రాణి ని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చేయాలని డిసైడయినట్టున్నాడు. అందుకే ఏకంగా మాస్ మహారాజా రవితేజ పక్క ఐటం సాంగ్ చేస్తోంది. వాస్తవంగా అప్సర రాణి ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు.. ఆర్జీవీ పరిచయమూ చేయలేదు. ఎక్కడో మరుగున పడి ఉన్నఈ హాట్ బ్యూటీని కొత్తగా ప్రజెంట్ చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు. అంకిత మహారాణ గా ఇంతకముందే తెలుగులో రెండు సినిమాలు చేసింది. కాని ఆ సినిమాలు ఏవరు అంతగా పట్టించుకోలేదు.

Apsara Rani to star in a special number with Ravi Teja in Krack | Telugu  Movie News - Times of India

కాని ఆర్జీవి థ్రిల్లర్ తో ఓవర్ నైట్ స్టార్ ని చేసేశాడు. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోస్ పక్కన అవకాశాలు వచ్చేలా ట్రై చేస్తున్నాడట. ఈ క్రమంలోనే మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో ఐటం సాంగ్ చేస్తోంది. రవితేజ పక్కన ఐటం సాంగ్ అంటే ఖచ్చితంగా ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో మంచి అవకాశాలు రావడం పక్కా అని అంటున్నారు. మొత్తానికి అప్సర రాణి కి అటు ఆర్జీవి ఇటు రవితేజ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.