సినీ జర్నలిస్టులంటే బకరాలేనా.?

ఓ సినీ జర్నలిస్టుతో రీసెంట్‌గా డైరెక్టర్ తేజ ఆడుకున్నాడు. మొన్న కూడా అదే జర్నలిస్టుతో హరీష్ శంకర్ కూడా ఆడుకున్నాడు. అదేంటీ.! సినీ జర్నలిస్టులంటే అంత బకరాల్లా కనిపిస్తున్నారా.? అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు మేకర్ల తీరుపై.

ఇష్టం లేని క్వశ్చన్స్ వేసినప్పుడు వాటిని సున్నితంగా తిరస్కరించాలి. ఖండించాలి. లేదంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పాలి. అంతేకానీ, ఆ ప్రశ్నల్ని ఎంకరేజ్ చేయడం.. అడిగిన వాళ్లని బకరాల్ని చేయడం ఏంటీ.? ఇదేం బాగా లేదంటున్నారు.

ఇదంతా అనుకోకుండానే జరుగుతోందా.? లేదంటే, డబ్బులిచ్చి వాంటెడ్‌గానే ఇలాంటి ప్రశ్నలు వేయడం.. వేయించుకోవడం చేస్తున్నారా.? అసలు ప్రెస్ మీట్స్ పేరు చెప్పి జరుగుతోన్న ఈ డ్రామాకి అర్ధమేంటీ.?

ఇదే విషయమై సదరు సినీ జర్నలిస్టు ప్రత్యేకంగా ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో, సినీ జర్నలిస్టులంతా ఈ విషయమై పునరాలోచనలో పడ్డారట.