మళ్ళీ మహేష్‌ను తగులుకున్నాడేంటి?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి నుంచి కూడా టాలెంట్ ఉన్న దర్శకులతో వీలైనంత వరకు టచ్ లోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. దర్శకుడిని నమ్మడంలో మహేష్ తరువాతే ఎవరైనా. సినిమా కథల విషయంలో ఒక్కసారి కమిటీ అయితే మహేష్ మాట మహేషే వినడు. ఒకవిధంగా బలమైన కమిట్మెంట్ తో నడుచుకుంటాడాని చెప్పవచ్చు.

అయితే మహేష్ కొన్నిసార్లు అతిగా నమ్మడం వలన కూడా దెబ్బ తిన్నాడు. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంతో కోలుకోలేని విధంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతరం స్పైడర్ దెబ్బ ఇంకా మర్చిపోలేదు అభిమానులు. అయితే ఇటీవల స్పైడర్ దర్శకుడు ఎఆర్.మురగదాస్ మళ్ళీ మహేష్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. విజయ్ తో ఒక సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.

ఇక విజయ్ రిజెక్ట్ చేయడంతో తమిళ్ లో శివకార్తికేయన్ తో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మొన్నటివరకు టాక్ బాగానే వచ్చింది. ఇక ఇప్పుడు మహేష్ కోసం కూడా ఒక కథ సెట్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. మహేష్ కు ఇప్పుడు కుదరకపోయినా భవిష్యత్తులో చేద్దామనే మాట తీసుకోవాలని అనుకుంటున్నాడట. మరి మహేష్ బాబు మళ్ళీ ఆ దర్శకుడిని నమ్మి మాట ఇస్తాడో లేదో చూడాలి.