Puneeth raj Kumar : అప్పు సార్ సినిమా కు కన్నడనాట రికార్డ్ స్థాయిలో ముందస్తు బిజినెస్…!

Puneeth raj Kumar : మనిషి బ్రతికున్నప్పుడు కంటే చనిపోయాక వారి విలువ తెలుస్తుంది అంటారు. ఇటీవలే మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విషయంలో ఏవి అక్షరాలా నిజం. ఆయనకు కన్నడనాట చాలా మంది అభిమానులు ఉన్నారని అందరికి తెలుసు. కానీ ఆయన మరణించక ఆయనకు ఇతర రాష్ట్రాలలో కూడా ఎంత మంది అభిమానులు ఉన్నారో అర్థమైంది. ఆయన సినిమాలు ఆయన సమాజ సేవ ఆయన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి.

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా జేమ్స్. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల స్క్రీన్స్‌లో విడుదల అవుతుంది. ఈ సినిమా లో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది మరియు తెలుగు హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు.ఈ సినిమా కోసం కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి ప్రత్యేక కారణం పునీత్ చివరి సినిమా కావడం. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేశాడు పవర్ స్టార్. కేవలం కర్ణాటకలోనే రూ.65 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్ మినహా మరే సినిమాకు ఇది సాధ్యం కాలేదు. కానీ పునీత్ చివరి సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ధైర్యం చేశారు. మరోవైపు మార్చి 17 నుంచి 24 వరకు కర్ణాటకలోని అన్ని థియేటర్లలో జేమ్స్ సినిమా మాత్రమే కనిపించనుంది. దీనికి పోటీగా మరో సినిమాను విడుదల చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 250 థియేటర్లలో జేమ్స్ విడుదలవుతుంది. రాధే శ్యామ్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కచ్చితంగా జేమ్స్ క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పునీత్ రాజ్ కుమార్‌పై ఉన్న సాఫ్ట్ కార్నర్‌తో కచ్చితంగా మంచి కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీలో కూడా దాదాపు 300 థియేటర్లలో విడుదల అవుతుంది జేమ్స్.