Anushka shetty & Naveen polishetty : జాతిరత్నంతో వంటలక్కగా దేవసేన.. క్రేజీ కాంబినేషన్లో త్వరలో సినిమా….!

Anushka shetty & Naveen polishetty : అనుష్క అనగానే అటు గ్లామర్ పాత్రలతో పాటు, లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో బాగా పాపులర్ అయింది. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా స్వీటీ శెట్టి ఇక ఆ తరువాత వెను తిరిగి చూసుకోలేదు. అటు టాప్ హీరోస్ సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఇక బాగా పేరు వచ్చిన సినిమా మాత్రం అరుంధతి. ఆ సినిమా లో జేజమ్మ పాత్రలో అనుష్క నటన అందరిని ఆకట్టుకుంది.

ఇక ఆ తరువాత కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న అనుష్క బాహుబలి సినిమాలో దేవసేనగా అలరించింది. ఇక ఆ తరువాత సినిమాల్లో జోరు తగ్గించింది అనుష్క. ఇక బాహుబలి తరువాత భాగమతి, నిశ్శబ్దం సినిమాల్లో చేసింది. ఇక భాగమతి సినిమా ఓ మోస్తరుగా హిట్ అయిన నిశ్శబ్దం సినిమా స్వీటీ అభిమానులను బాగా నిరాశపరిచింది. ఇక కరోనా లాక్ డౌన్ అన్ని అయ్యాక కూడా అనుష్క ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేయకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. స్వీటీ ఇక సినిమాలు చేయడం ఆపేసి పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.

ఇక స్వీటీ ఇప్పుడోక కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసి అభిమానులను ఖుషి చేసింది. అనుష్క జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది ఇక ఈ సినిమాలో అనుష్క ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ చెఫ్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో నవీన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇక నవీన్ సినిమా అనగానే కామెడీ ట్రాక్స్ ను ఎక్సపెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య కామెడీ సన్నివేశాలు బాగా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ సినిమాను ప్రభాస్ సన్నిహితులదైనా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో అనుష్క జూన్ నుండి పాల్గొంటున్నారు.