సూపర్ చిత్రంతో సూపర్ స్పీడ్‌గా దూసుకొచ్చిన అందాల భామ అనుష్క. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసిన అనుష్క వేదం చిత్రంలో వేశ్యగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అరుంధతి సినిమాలో జేజెమ్మగా నటించి ప్రేక్షకుల మనసులలో తన స్థానాన్ని సుస్థిర పరచకుంది. బాహుబలి సినిమాలో దేవసేనగా అదరగొట్టింది. ఇక భాగమతి చిత్రాన్ని తన పర్‌ఫార్మెన్స్‌తో పీక్ స్టేజ్‌కు తీసుకెళ్ళింది. రీసెంట్‌గా వచ్చిన నిశ్శబ్ధంలో మూగ యువతిగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. జనవరి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టనుంది.
అందం, అభినయంతో పాటు మంచి నటనా పటిమ ఉన్న అనుష్క అశేష ప్రేక్షకాదరణ పొందింది. కొన్నాళ్ళుగా ఆమె అభిమానులు పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుష్క నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ప్రభాస్‌ని పెళ్లి చేసుకోనుందని కొందరు , ఓ బిజనెస్ మ్యాన్‌ను వివాహమాడనుందని మరి కొందరు ప్రచారాలు చేశారు. వీటిని అప్పట్లో కొట్టి పారేసింది. 38 ఏళ్ళ వయస్సు ఉన్న అనుష్క ప్రస్తుతం తన పెళ్ళిపై మరో సారి నోరు విప్పిఒంది.
వివాహ వ్యవస్థపై నాకు చాలా నమ్మకముంది. కాని అంత తొందరలేదు. నచ్చిన వాడు ఎదురుపడినప్పుడే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటాను. కాని ఆ విషయంలో తొందరలేదు. 20 ఏళ్ళ వయస్సు నుండే నా తల్లిదండ్రులు నా పెళ్లిపై ఒత్తిడి తీసుకొచ్చారు. కాని వారి ఆలోచనా ధోరణి ఇప్పుడు మారిందంటూ పెళ్ళి, పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చింది అనుష్క. అయితే నచ్చిన వాడు దొరికితే పెళ్ళి చేసుకుంటానంటున్న అనుష్కకు ఇంకెప్పుడు దొరకుతాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు