ఆలోచనలో పడిన అనుష్క.!

స్వీటీ అనుష్క ఆలోచనలో పడిందట. ఎందుకంటారా.? ఆమెకు హీరోయిన్‌గా మళ్లీ అవకాశాలు వస్తున్నాయట. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమా కోసం అనుష్కని సంప్రదించారట. ఆ సీనియర్ హీరోనే అనుష్క పేరును ప్రస్థావించారనీ తెలుస్తోంది. గతంలో ఓ సాంగ్‌ కోసం ఆ సీనియర్ హీరోతో అనుష్క నటించింది.

ఆ తర్వాత ఆ సీనియర్ హీరోతో మళ్లీ నటించే అవకాశం రాలేదు అనుష్కకి. కానీ, ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ వచ్చేసిందట. మరి, అనుష్క యూజ్ చేసుకుంటుందా.? అంటే అక్కడే సస్పెన్స్ నెలకొంది.

అనుష్క ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటిస్తోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో మేల్ లీడ్ పోషిస్తుండగా, అనుష్కది ఫీమేల్ లీడ్. ప్రమోషనల్ పోస్టర్లు బాగున్నాయ్.

సినిమాపై ఒకింత స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. అన్నీ బాగుండి, సినిమా హిట్టయితే, మాత్రం అనుష్క అంగీకరించి తీరాల్సిందే. ఆమెకు అవకాశాలు రావడం తథ్యం. అసలే టాలీవుడ్‌కి సీనియర్ హీరోయిన్ల కొరత ఏ రేంజ్‌లో వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుష్క లాంటి ఓ ప్రామిసింగ్ హీరోయిన్ దొరికితే, సీనియర్ హీరోల సినిమాలకు ఖచ్చితంగా వెయిట్ పెరుగుతంది. ఇక, అనుష్క ఆలోచించి, నే నిర్ణయం తీసుకోవల్సిందే మరి.