Anushka Shetty : సమంత వదులుకున్నది స్వీటీ చేతికి దొరికినట్టేనా?

Anushka Shetty: టాలీవుడ్ లో కొద్ది మంది స్టార్ హీరోయిన్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. అరుంధతి సినిమాతో తన నటనతో అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బాహుబలి సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి సినిమా తర్వాత భాగమతి ,నిశ్శబ్దం లాంటి సినిమాలు మాత్రమే చేసింది. సైరా నరసింహారెడ్డి లో ఝాన్సీ లక్ష్మీబాయి గా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. మునుపటి మాదిరిగా వెంటవెంటనే సినిమాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు అనుష్క.

ఇటీవల వెట‌రన్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకోవాల‌న్న ఉత్సాహం చూపిస్త‌న్నారు. ఈ వ‌య‌సులోనూ ఆయ‌న‌కు ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉందట.అదే `బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ‌` బ‌యోపిక్‌. ఇదో దేవ‌దాసీ జీవితం త‌న జీవితంలో అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్ గానూ స్ట్రాంగ్ క‌థ ఇది.ఒక దేవదాసి గా మొదలైన ఆమె జీవిత ప్రయాణం ఎంతోమంది సంగీత నృత్య కళాకారులకు ఆసరాగా నిలిచింది.

మొదట ఈ బయోపిక్ కోసం సమంతను అనుకున్నారు.ఆమెకు ఈ క‌థ వినిపించారు కూడా. అయితే ఈ సినిమా చేయాలా, వ‌ద్దా? అనే డైలామాలో స‌మంత ఉండిపోయిందట. కానీ ఆమె ఆ ప్రాజెక్టు పై అంతగా ఆసక్తి చూపలేదు. ఇక రీసెంట్ గా సింగీతం శ్రీనివాసరావు అనుష్కను సంప్రదించి కథ వివరించారట,అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.మ‌రి… స‌మంత‌, అనుష్క‌ల‌లో నాగ ర‌త్న‌మ్మ పాత్ర‌ని ఎవ‌రు స్వీక‌రిస్తారో చూడాలి. ప్రస్తుతం అనుష్క యూవీ క్తియేషన్స్ లో నవీన్ పొలిశెట్టితో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతోంది.