హాట్ డోస్ పెంచేసిన అనుపమా.!

‘రాక్షసుడు’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాల తర్వాత అనుపమ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ, సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గానే కనిపించింది. అయితే, సడెన్‌గా అనుపమా పరమేశ్వరన్ హాట్ అప్పీల్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఇంతకీ అనుపమ హాట్ షో ఎందుకంటారా.?

అనుపమా పరమేశ్వరన్ కొత్త సినిమా ‘రౌడీ బాయ్స్’ కోసం. ప్రముఖ నిర్మాత శిరీష్ కొడుకు ఆశిష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లేటెస్టుగా ఈ సినిమా నుండి ‘ ప్రేమ ఆకాశమైతే..’ అనే పాట రిలీజ్ చేశారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ అయ్యింది. రిలీజైన కొన్ని గంటల్లోనే ఈ పాట నెట్టింట వైరల్ అయ్యింది. యూత్‌ని తెగ ఊపేస్తోంది. ఈ సాంగ్‌లో అనుపమ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. అనుపమ హాట్ షోకి యూత్ కిర్రెక్కిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు మరో మెయిన్ అట్రాక్షన్.