అనుపమా పరమేశ్వరణ్ అందం, అదృష్ణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళం ప్రేమమ్ చిత్రంతో సౌత్ మొత్తాన్ని కట్టిపడేసింది. ఆ ఒక్క చిత్రంతో అనుపమకు లక్కు బాగా కలిసి వచ్చింది. తెలుగు రీమేక్‌లోనూ అనుపమే నటించింది. ఇక ఆపై తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అయిపోయారు. ఆ తరువాత అ ఆ చిత్రంతో మరోసారి కట్టిపడేసింది. త్రివిక్రమ్ హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలా అనుపమ కెరీర్ బాగానే మొదలైంది. కానీ ఎక్కడో ఏదో ఆమెను వెనక్కి లాగినట్టే అనిపిస్తుంది. ఆమెను అందరూ హోమ్లీ పాత్రల్లోనే చూడాలనుకోవడం, మోడ్రన్, ఎక్స్ పోజింగ్ పాత్రలకు ఆమె దూరంగా ఉండటం ఇలా అన్నీ కలిసి ఆమెను ఓ సర్కిల్‌లోనే ఉంచేసింది. అలా రంగస్థలంలో రూపంలో ఓ అదృష్టం వస్తే వదిలేసుకుంది. ఇక శతమానంభవతి లాంటి హిట్ వచ్చినా ఆమెకు క్రెడిట్ రాలేదు.
ఇలా అనుపమా చివరకు రామ్ సినిమాలతో సెట్ అయిపోయింది. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే అంటూ ఇద్దరూ కలిసి నటించారు. కానీ అవి రెండూ వర్కవుట్ కాలేదు. ఇక అప్పటి నుంచి అనుపమకు తెలుగులో అవకాశాలే రాలేదు. రాకరాక ఇప్పుడు ఓ ఛాన్స్ వచ్చింది. నిఖిల్ సరసన 18 పేజీలు అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంపికైంది. మరి ఈ చిత్రమైన వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.