చీరకట్టులో అదరగొట్టేసిన అనుపమ!

మొదటి సినిమాతోనే తెలుగు అడియన్స్‌ హృదయాలను దొచేసిన హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘అఆ’ తో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి.. ఉంగరాల ముంగురులు.. చూడచక్కని రూపంతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

దీంతో ఈ ముద్దుగుమ్మకు యూత్‌లో ఫాలోయింగ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. అటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్‌ క్రేజీ ఫోటోస్‌ షేర్‌ చేస్తుంటుంది.

అలాగే పాట పాడుతూ.. డాన్స్‌ చేస్తూ వీడియోస్‌ పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓనమ్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా మలయాళంలో పాట పాడి అలరించింది ఈ కేరళ కుట్టి. తాజాగా చీరకట్టుతో డాన్స్‌ చేసి యూత్‌ ని ఫిదా చేసింది. ప్లేయిన్‌ బ్లూ చీరలో మరింత అందంగా ముస్తాబై డాన్స్‌ చేసింది అనుపమ. ఈ బ్యూటీ వేసిన సింపుల్‌ స్టెప్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరలయ్యింది. ఇక అనుపమ డాన్స్‌ వీడియోకు క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. ఇప్పటివరకు అనుపమకు ఇన్‌ స్టాలో 14 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ బ్యూటీ షేర్‌ చేసే వీడియోస్‌, ఫోటోలకు భారీగా లైక్స్‌ వస్తుంటాయి. సంప్రదాయ చీరకట్టులో అనుపమ షేర్‌ చేసే ఫోటోస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.