బిగ్ లీగ్‌లోకి అనుపమ పరమేశ్వరన్.!

‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాలో నాగవల్లిగా కనిపించి మరింతగా తెలుగు ప్రేక్షకుల మనసుకు దగ్గరైంది.

‘కార్తికేయ 2’ అనుపమకి బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చేమో. ఎంత చెప్పుకున్నా ఇంతవరకూ చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకున్న అనుపమకు ఓ బిగ్ ప్రాజెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది.

ఓ స్టార్ హీరో సరసన అనుపమ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇదంతా ‘టిల్లు స్క్వేర్’ ఎఫెక్టే అంటున్నారు.

ఈ సినిమా కోసం అనుపమ గ్లామర్ గేట్లు పూర్తిగా తెరిచేసింది. సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా రిలీజ్ కాలేదు కానీ, ఇప్పటి వరకూ రిలీజైన గ్లింప్స్, ప్రోమోస్ చూస్తుంటే అనుపమ హాట్ అప్పియరెన్స్ అన్‌లిమిటెడ్ అనేలా కనిపిస్తోంది ఈ సినిమాలో.

ఈ ఎఫెక్ట్‌తోనే అనుపమకు ఓ బిగ్ కమర్షియల్ మూవీ ఆఫర్ వచ్చిందట. గతంలో అనుపమ పని చేసిన ఓ స్టార్ డైరెక్టర్ ఈ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో వున్న హీరోయిన్ల కొరతే అనుపమకి బాగా కలిసొచ్చినట్లుంది. ఏది ఏమైతేనేం, ఈ ఆఫర్‌తో అనుపమ బిగ్ లీగ్‌లోకి చేరిపోతుందేమో చూడాలిక.