అవకాశాల కోసం అనుపమా ఎంచుకున్న మార్గం ఇదా!?

Anupama Parameswaran
అయ్యో..అనుపమా?.. అని అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. అందుకు కారణం లేకపోలేదు. ఎవరినైతే నమ్మి ఇండస్ట్రీకి వచ్చిందో.. వాళ్లే కెరీర్ ని పాడుచేశారట. ఇపుడు ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా ఉంది.
 
Anupama Parameswaran
Anupama Parameswaran
తొలిసారిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు  అవకాశాల కోసం అందరివద్దకు వెళ్లి కలవడం కామనే! కానీ, ఎన్నో చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పర్చుకున్నాక కూడా  అవకాశాల కోసం అందరివద్దకు వెళ్లడం నిజంగా విచిత్రమే! ”మరి ఏం చేయమంటారు? అవకాశాలు ఇవ్వమని ఎంత ప్రాధేయ పడుతున్న ససేమిరా.. అంటున్నారు. అవకాశాలు కావాలంటే మరో మార్గాన్ని ఎంచుచుకో అంటున్నారు. ఆ మరో మార్గం ఏంటో మాత్రం చెప్పడం లేదు” అని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్!
 
ప్రేమకథా చిత్రాల్లో చక్కగా ఒదిగిపోతుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. చూడముచ్చటైన రూపంతో పాటు అద్భుత అభినయంతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తాజాగా ఈ సొగసరి తెలుగులో నిఖిల్‌తో జోడీకట్టబోతున్నది. జీఏ2 పిక్చర్,  సుకుమార్‌ రైటింగ్‌ పతాకాలపై పల్నాటి సూర్యప్రకాష్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ’18పేజీస్‌’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా ఖరారైంది.
 
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘కథలో కొత్తదనం నచ్చి ఈ సినిమాలో నటించడానికి అనుపమ పరమేశ్వరన్‌ అంగీకరించింది. నిఖిల్‌, అనుపమ జోడీ తెరపై అద్భుతంగా ఉంటుంది. వారి పాత్రల్ని అందరు మెచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. భిన్న భావోద్వేగాల కలబోతగా సాగే వినూత్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’  అని దర్శకుడు చెబుతున్నారు.