మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ బంపరాఫర్ ఇచ్చింది. తనకు ఒక ఖడ్గమృగాన్ని తెచ్చి బహుమతిగా ఇస్తే విూ సొంతం అయిపోతానని చెప్పేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే అనుపమ లాంటి అమ్మాయి ఆఫర్ ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. కచ్చితంగా ఆ గిప్ట్ కొనిచ్చేస్తారుగా.
ఇంతకీ అనుపమ ఏం చెప్పింది? అసలేం జరిగింది? మలయాళ ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అనుపమ.. ‘అఆ’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘శతమానం భవతి’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘కార్తికేయ 2’ తదితర చిత్రాలు చేసింది. రీసెంట్‌గా రవితేజ ‘ఈగల్’లో కీలక పాత్రలో కనిపించింది.
ఈమె సూపర్ హాట్‌గా నటించిన ‘టిల్లూ స్క్వేర్’ త్వరలో థియేటర్లలోకి రానుంది. సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ విూడియాలోనూ చురుగ్గా ఉండే అనుపమ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
తాజాగా ఓ ఖడ్గమృగం పిల్లకి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి, దీన్ని ఎవరైనా తనకు బహుమతిగా ఇస్తే తను వాళ్ల సొంతమైపోతానని చెప్పింది. అంటే డేటింగ్ లేదా పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా చెప్పింది. ఇప్పుడీ క్యాప్షన్‌పై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.