బాధపెట్టి ఉంటే క్షమించండి.. అనుపమ రచ్చ మామూలుగా లేదు!

అనుపమ పరమేశ్వరణ్ ఎంత క్యూట్‌గా ఎంత సంప్రదాయబద్దంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అది వెండితెరైనా సోషల్ మీడియా అయినా సరే అనుపమ మాత్రం హద్దుల్లోనే ఉంటుంది. ఎన్నడూ కూడా వల్గారిటీని ప్రోత్సహించలేదు. ప్రతీసారి చీరకట్టులో కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా అనుపమా మాత్రం రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. రీసెంట్ అనుపమ మాత్రం ఓ ఫోటో షేర్ చేసి రచ్చ చేసింది.

Anupama Parameswaran Explanation ABout Her Bold Pic
Anupama Parameswaran Explanation ABout Her Bold Pic

అనుపమ ఏనాడూ కూడా అందాల ఆరబోత చేయలేదు. సోషల్ మీడియాలోనూ చీరకట్టు, మోడ్రన్ డ్రెస్సులో ఒళ్లంతా కప్పుకునే కనిపిస్తూ ఉంటుంది. కానీ తాజాగా మాత్రం అనుపమ చిచ్చు పెట్టింది. వీపును చూపిస్తూ పొట్టి బట్టలు వేసుకుంది. అందులో కాళ్లు చేతులు మొత్తం కనిపిస్తున్నాయి. అయితే ఈ హాట్ ఫోటోలు చూసి అనుపమ అభిమానులు హర్ట్ అయ్యారు. అలా బాధపడ్డ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది.

Anupama Parameswaran Explanation ABout Her Bold Pic
Anupama Parameswaran Explanation ABout Her Bold Pic

మీ నుంచి మేము ఇలాంటివి ఆశించలేదు.. మీరు అందంగా క్యూట్‌గా ఉంటారు మంచి డీసెంట్ నటి. ఇలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్ అంటూ వేడుకున్నాడు. ఇక ఈ కామెంట్లపై అనుపమా స్పందిస్తూ.. నాకు ఆశ్చర్యంగా ఉంది దుస్తులు ఓ మనిషిని డీసెంట్ అని డీసెంట్ కాదని ఎలా చూపుతాయో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సరే నా చేతులు, కాళ్లు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండని అనుపమ కోరింది.