అనుపమా గ్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చింది!

Anupama Parameshwaran agrees to do a web series

కరోనా ప్రభావంతో గత  కొంత  కాలంగా సినిమాల షూటింగ్‌లు లేకపోవడం, థియేటర్లు కూడా ఓపెన్‌ కాకపోవడంతో కథానాయికలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇళ్లకే పరిమితమైన ప్రజలకు వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లను (ఓటీటీ సంస్థలు) బాగా పుంజుకున్నాయి. అంతేకాదు డిజిటిల్‌ మీడియాని శాసించే స్థాయికి వచ్చాయి.

Anupama Parameshwaran agrees to do a web series
Anupama Parameswaran

దీంతో ఓటీటీల కోసం రూపొందే వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు కథానాయికలు రెడీ అయిపోయారు. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే సమంత, సాయిపల్లవి వంటి కథానాయికలు సైతం వెబ్‌ సిరీస్‌ల్లో మెరవబోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి  అనుపమా పరమేశ్వరన్  చేరింది.

తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు రూపొందించబోయే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు  అనుపమా గ్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చినట్టు సమాచారం. కార్పొరేట్‌ ప్రపంచంలో ఉన్న పోటీ, వేగం వంటి తదితర అంశాల నేపథ్యంలో.. థ్రిల్లర్‌ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఈ సిరీస్‌లో  అనుపమా మోడ్రన్‌ కార్పొరేట్‌ గర్ల్ గా భిన్న మైన పాత్రను పోషించనుందట.