ఇన్సైడ్ టాక్ : పవన్ సినిమాలో మరొక హీరోయిన్ 

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ అలాగే యంగ్ హీరో సుజీత్ తో చేస్తున్న చిత్రాలు కోసం తెలిసిందే. అవే “ఉస్తాద్ భగత్ సింగ్” మరియు “ఓజి” సినిమాలు కాగా ఈ చిత్రాల్లో అయితే యంగ్ హీరోయిన్స్ శ్రీ లీల మరియు ప్రియాంక అరుళ్ మోహన్ లు అయితే నటిస్తున్నారు.

కాగా ఇప్పుడు వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఓ బజ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఆల్రెడీ యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమెతో పాటుగా ఈ చిత్రానికి ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ పేరుని మేకర్స్ చూస్తున్నారట. మరి ఆమెనే అక్కినేని అఖిల్ తో ఏజెంట్ అనే భారీ డిజాస్టర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాక్షి వైద్య అట.

కాగా ఈమె ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈమె పేరుని లాక్ చేయగా కొన్ని రోజుల్లో తాను కూడా షూటింగ్ లో పాల్గొంటుంది అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.