‘గుంటూరు కారం’ తప్పుకున్నట్టే.!

‘వున్నపళంగా ప్రాజెక్టుని క్యాన్సెల్ చేసేసుకోవడమే బెటర్’ అన్నమాట ఇటీవలి కాలంలో ఏ పెద్ద సినిమా విషయంలోనూ వినిపించలేదేమో.! అలా వినిపించడం అస్సలేమాత్రం మంచిది కాదు.! దురదృష్టవశాత్తూ, ‘గుంటూరు కారం’ సినిమా మీద అలాంటి మాటలు వినిపిస్తున్నాయ్.

హీరోయిన్ పూజా హెగ్దే తప్పుకోవడం దగ్గర్నుంచి చాలా విషయాలు ‘గుంటూరు కారం’ సినిమాపై నెగెటివ్ వైబ్స్‌కి కారణమవుతున్నాయి. సంక్రాంతి బరిలోంచి తప్పుకుందన్నది ‘గుంటూరు కారం’ మీద వస్తోన్న ఇంకో గాసిప్. అదే నిజమైతే, సినిమాని ఆపేసుకోవడం మంచిది.. అన్న అభిప్రాయంతో వున్నారు మహేష్ అభిమానులు.

పెద్ద బ్యానర్.. పెద్ద హీరో… పెద్ద దర్శకుడు.. అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని.. అన్నట్లు తయారైంది ‘గుంటూరు కారం’ పరిస్థితి. ఎవరికీ సీరియస్‌నెస్ లేకుండా పోయిందా.? నిజమేనా.? నిర్మాణ సంస్థ ఎందుకు గట్టిగా ఈ వ్యవహారాలపై పెదవి విప్పడంలేదట.? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది సుమీ.!