హాలీవుడ్ బాటలో మరో స్టార్ డైరెక్టర్?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ దర్శకుల జాబితా తీసుకుంటే అందులో కచ్చితంగా సంజయ్ లీలా భన్సాలీ ఉంటారు. బాలీవుడ్ లో ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండియన్ హిస్టరీలో కథలను తెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఆయన తెరకెక్కించిన దేవదాస్, బాజీరావు మస్తానీ, పద్మావత్, రీసెంట్ గా గంగుభాయ్ కతియావాడి సినిమాలు చూసిన వారికి భన్సాలీ సత్తా ఏంటో అనేది కచ్చితంగా తెలుస్తుంది.

అతని సినిమాలు హిందీలోనే వచ్చిన అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా, అలాగే అన్ని ప్రాంతాల వారికి బాగా చేరువవుతాయి. అద్భుతమైన డ్రామాని తెరపై ఆవిష్కరించడంలో భన్సాలీ ఎక్స్ పర్ట్ అని చెప్పాలి. తాజాగా హీరమండి అనే వెబ్ సిరీస్ తో ఆయన ప్రేక్షకుల ముందుకి వచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఆయన నుంచి చివరగా వచ్చిన గంగుభాయ్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అయింది.

బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో ఇంటర్నేషనల్ ప్రీమియర్ గా ఈ సినిమాని ప్రదర్శించారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ లో భన్సాలీ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయింది. రాజమౌళి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన హాలీవుడ్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా భన్సాలీ హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ డబ్యూఎంఈతో ఒప్పందం చేసుకున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటులు ఈ క్యాస్టింగ్ ఏజెన్సీలో ఉన్నారు. ఈ నేపధ్యంలో భన్సాలీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ పై కన్ఫర్మ్ వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే రాజమౌళి కూడా ఒక హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఒప్పందం చేసుకున్నారు.

ఇప్పుడు భన్సాలీ కూడా అలాంటి ఒప్పందం చేసుకోవడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో భన్సాలీ సినిమా ప్లానింగ్ చేస్తున్నారంటూ ప్రచారం నడించింది. అలాగే బన్నీతో కూడా భన్సాలీ మూవీ చేయనున్నారు అంతో జోరుగా టాక్ వినిపించింది. ఇప్పుడు అతను చేయబోయే హాలీవుడ్ సినిమాలో కచ్చితంగా బన్నీ లేదా జూనియర్ ఎన్టీఆర్ లో ఒకరు ఏదో ఒక పాత్ర చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.