ఇటీవలి కాలంలో ఆశ్చర్యపరిచే విజయం సాధించిన సినిమాల్లో కోర్ట్ ఒకటి. చిన్న బడ్జెట్, కొత్త నటీనటులు అయినప్పటికీ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో కథను ఆకట్టుకునేలా రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ తన రెండో ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఓ దర్శకుడి తొలి సినిమాకే రెండో ఛాన్స్ ఇవ్వడం అరుదు. కానీ నాని మాత్రం కోర్ట్ విజయంతో ఆశ్చర్యపరిచిన రామ్ జగదీశ్‌కి మరో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు సమాచారం. ఈసారి కథ మరింత విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. దుల్కర్ సల్మాన్‌ను కథానాయకుడిగా తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. మొదటిదశ చర్చలు పూర్తవ్వగా, ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నారు.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త చిత్రం ప్రారంభానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే దర్శకుడు రామ్ జగదీశ్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను గట్టి ప్రమోషన్‌తో లాంఛనంగా మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. తొలి సినిమాతోే తనదైన మార్క్ చూపించిన ఆయన, ఇప్పుడు స్టార్ కాస్టింగ్‌తో మరింత స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.